ఒడిశాలో కటక్ సమీపంలోని నిర్గుండి వద్ద రైలు ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ నిర్గుండి వద్ద గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఘటనలో మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పగా, 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని కటక్‌లోని ఎస్ఎస్బీ వైద్య కళాశాలకు తరలించారు.
గూడ్స్‌ను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు.. 15మందికి గాయాలు - Cuttack rail accident news
ఒడిశాలోని నిర్గుండి వద్ద లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్.. గుడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 బోగీలు పట్టాలు తప్పగా, 15 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పట్టాలు తప్పిన రైలు... 50మందికి పైగా గాయాలు
ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే ఆరు రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పొగమంచు వ్యాపించి ఉందన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Last Updated : Jan 16, 2020, 11:16 AM IST