కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రెండు రోజులపాటు కార్యాలయాన్ని మూసివేసినట్లు సీఎం వనారాయణస్వామి వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా భవనానికి శానిటైజ్ చేయించనున్నట్టు తెలిపారు.
శుక్రవారం ఒక్కరోజులోనే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 87 కేసులు నమోదు కాగా.. అందులో సీఎం కార్యాలయ సిబ్బంది కూడా ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంఓను సందర్శించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాధితుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు.