కేరళలోని కోజికోడ్ విమాన ప్రమాద ఘటనలో క్షతగాత్రులను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ పరామర్శించారు. వారిద్దరూ కొజికోడ్ వైద్య కళాశాలను సందర్శించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం విజయన్.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు, అధికారులు ప్రతిస్పందించిన తీరును ట్విటర్‌లో ప్రశంసించారు.
భారీ వర్షాల కారణంగా వాతావరణం సహకరించకపోయినా.. కరోనా భయం వెంటాడుతున్నా తోటి మనుషులను కాపాడుకోవాలనే సంకల్పంతో సాహసోపేతంగా వ్యవహరించారని కొనియాడారు. విమాన ప్రమాదంలో బాధితులకు రక్తదానం చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడం దీనికి మరో ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటితో పోరాడటం కేరళ ప్రజలకు కొత్తేం కాదన్నారు. ఇదివరకే చాలాసార్లు చూశామని తెలిపారు. మానత్వం, మంచితనం తమ సమాజంలో అడుగడుగునా ఉందన్నారు. ఈ సందర్భంగా మలప్పురం, కొజికోడ్ జిల్లాల ప్రజలను అభినందించారు.
22 మంది పరిస్థితి విషమం