మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో భేటీ అయినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఈ సమావేశం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న ఊహాగానాలకు ఇరువురు నేతలు తెరదించారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వం బలంగా ఉందని పునరుద్ఘాటించారు సంజయ్ రౌత్.. కొందరు కావాలనే ప్రభుత్వ మనుగడపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే భేటీ ఎందుకు జరిగిందనేది ఆయన వెల్లడించలేదు.
దేవేంద్ర ఫడణవీస్ ఫిర్యాదు
ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. గవర్నర్ కోశ్యారీని కలిసిన అనంతరం ఈ భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ కోశ్యారీ జోక్యం పట్ల శరద్ పవార్ ఇదివరకే బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆహ్వానం మేరకే, శరద్ పవార్ రాజ్‌భవన్ వెళ్లారని.. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని ఎన్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు కొవిడ్-19 నివారణలో ప్రభుత్వం విఫలమైందని భాజపా నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి : మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్