తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాటర్​ టాక్సీ సర్వీసులు ప్రారంభించిన కేరళ - kerala boats updates

కేరళవాసుల కోసం అక్కడి ప్రభుత్వం.. మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది. తొలిసారిగా 'వాటర్​ టాక్సీ' సేవలను ప్రారంభించింది. కాటమరాన్​ పడవలతో ఈ సేవలను అందిస్తోంది ఆ రాష్ట్ర జల రవాణా శాఖ. అలప్పుజ రేవులో ఈ పడవలు అందుబాటులోకి వచ్చాయి.

CM launches Kerala's first water taxi; SWTD's Catamaran boat service also commissioned
'కాటరామన్​' పడవల్లో కేరళలో తొలి వాటర్​ ట్యాక్సీ​

By

Published : Oct 18, 2020, 6:35 PM IST

Updated : Oct 18, 2020, 7:12 PM IST

కేరళలో తొలి వాటర్​ టాక్సీని అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'కాటమరాన్' పడవల ద్వారా కేరళ జల రవాణా శాఖ అందించే ఈ సేవలను గురువారం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ప్రారంభించారు. అలప్పుజ రేవులో జరిగిన ఈ కార్యక్రమంలో వర్చువల్​గా పాల్గొన్నారు సీఎం. కాటమరాన్ డీజిల్ శక్తితో పనిచేసే ఈ ట్యాక్సీలో 10 మంది ప్రయాణించొచ్చు.

పరుగులు పెడుతున్న కేరళ వాటర్​ టాక్సీ

'సురక్షిత ప్రయాణం'

వాటర్​ టాక్సీని ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న సీఎం పినరయి విజయన్​

కాటమరాన్​ పడవల్లో ప్రయాణం సురక్షితమైనదని అన్నారు విజయన్. జల రవాణాలో తాజాగా తీసుకువచ్చిన ఈ మార్పులతో.. కేరళ పర్యటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ​ఆకాంక్షించారు.

"కాటమరాన్ పడవలతో జలరవాణాకు మంచి ఆదరణ లభిస్తుంది. వీటిలో ప్రయాణం చౌకైనది, సురక్షితమైనది. ఈ నూతన జలరవాణాకు ఓడల భూమిగా పేరు గాంచిన అలప్పుజ.. తగిన ప్రదేశం. ఈ సేవలతో కేరళ పర్యటకం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇందులో ప్రయాణికులకు బీమా సౌకర్యాన్నీ కల్పిస్తున్నాం."

-- పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి

జ్యోతి ప్రజ్వలన చేసి వాటర్​ టాక్సీని ప్రారంభిస్తున్న నేతలు

రూ.3.14 కోట్ల వ్యయంతో 4 వాటర్ టాక్సీలను కేరళ ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిలో మొదటి పడవను గురువారం ప్రారంభించారు. 7 నాటికల్ మైళ్ల వేగంతో ఈ పడవలు పరిగెడుతాయి. రూ.14 కోట్ల వ్యయంతో మొత్తం ఏడు కాటమరాన్ బోట్లను నిర్మిస్తోంది కేరళ ప్రభుత్వం.

న‌వ‌గ‌తి మెరైన్ డిజైన్ అండ్ కన్​స్ట్రక్షన్స్​ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ వాట‌ర్ టాక్సీల‌ను నిర్మించింది. ఎలక్ట్రిక్ ప‌వ‌ర్ స్టీరింగ్, సోలార్ ప్యానెల్ అమ‌రిక‌తో అన్ని విద్యుత్ అవ‌స‌రాల‌ను తీర్చేలా దీన్ని తయారుచేశారు. చిన్న ప‌రిమాణం కార‌ణంగా వీటిల్లో ఎక్క‌డికైనా చేరుకోవ‌చ్చు. గంట‌కు 30 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తాయి.

ఇదీ చూడండి:కేరళలో ఆగని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 9,016 కేసులు

Last Updated : Oct 18, 2020, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details