దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు.. కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. గొంతునొప్పి, సాధారణ జ్వరం కారణంగా.. ఆదివారం స్వీయనిర్బంధంలోకి వెళ్లిన కేజ్రీవాల్ నుంచి ఈ ఉదయమే నమూనాలు సేకరించారు వైద్యులు. అయితే, బుధవారం ఉదయానికి నమూనాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
సీఎం నమూనాల సేకరణ.. బుధవారం రిజల్ట్
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ ఉదయం నమూనాలు సేకరించారు. ఫలితాలు బుధవారం ఉదయం వెల్లడిస్తారు.
సీఎంకు కరోనా ఉందో, లేదో రేపే తెలుస్తుంది!
ఆదివారం ఉదయం కేబినెట్ మీటింగ్‌లో పాల్గొన్నారు కేజ్రీవాల్. సమావేశం అనంతరం.. అస్వస్థతకు గురైన కారణంగా ముఖ్యమంత్రి అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది సీఎం కార్యాలయం. గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు వైద్యులు.
ఇదీ చదవండి:ఒకే ఇంట్లో 26 మందికి కరోనా