తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వివాహానికి హాజరైన ముఖ్యమంత్రిపై విమర్శలు - కర్ణాటక ముఖ్యమంత్రి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహ వేడుకలకు దూరంగా ఉండాలని సూచించాయి పలు రాష్ట్రాలు. అయితే ప్రభుత్వ ఆదేశాలు సామాన్య ప్రజలకే అన్నట్లు.. ప్రముఖులకు కాదన్నట్లు వ్యవహరించారు ఆ ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆదేశాలను ఏకంగా సీఎం పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

CM attending large-scale wedding raises eyebrows
వివాహానికి హాజరైన ముఖ్యమంత్రిపై విమర్శలు

By

Published : Mar 16, 2020, 5:17 PM IST

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వైరస్​కు అడ్డుకట్ట వేసేందుకు ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడొద్దని పలు రాష్ట్రాలు సూచించాయి. ప్రధానంగా వివాహ వేడుకలపై ఆంక్షలు విధించాయి. అయితే కర్ణాటకలోనూ ఆ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర భాజపా ఎమ్మెల్సీ మహంతేష్ కవతాగిమత్​ కూతురు వివాహానికి స్వయంగా ముఖ్యమంత్రి యడియూరప్ప హాజరుకావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎంతో పాటు అనేక మంది నాయకులు ఆ వివాహానికి హాజరైనట్లు అధికారులు తెలిపారు. వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను స్వయంగా సీఎం విస్మరించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే వివాహ వేడుకకు హాజరు కావటంపై వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యడియూరప్ప.

"ఎక్కువ మంది ప్రజలు ఒకేచోట ఉండకూడదని ముందుగానే సూచించాము. వివాహ వేడుకలో కూడా ఎక్కువ మంది ఒకేచోటు గుమికూడలేదు."

-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.

ఇదీ చదవండి:తినగానే ఈ ఏడు పనులు చేస్తున్నారా... అయితే జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details