పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదసిర్కు అత్యంత సన్నిహితుడు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కీలక సభ్యుడు సజ్జద్ ఖాన్ దిల్లీలో అరెస్టయ్యాడు. పుల్వామా నివాసితుడు సజ్జత్ గురువారం రాత్రి లజ్పత్ రాయ్ మార్కెట్ సమీపంలో దిల్లీ ప్రత్యేక పోలీసు బృందానికి చిక్కాడు.
దిల్లీలో స్లీపర్ సెల్స్ ఏర్పాటుకు సజ్జద్ ఖాన్కు ముదస్సిర్ ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు.