తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...? - సోషల్​ మీడియా

వాస్తవాలకు విరుద్ధంగా, మూఢనమ్మకాలను ఇంకా బలంగా విశ్వసిస్తున్నారని చెప్పడానికి ఇదో నిదర్శనం. సాధారణంగా.. మరణించిన మనిషి తిరిగి పునరుజ్జీవం పోసుకుంటాడా..? అంటే ఇది అసాధ్యం. కానీ.. నీళ్లలో మునిగి చనిపోయిన వ్యక్తుల భౌతికకాయాల్ని క్వింటాల్​ ఉప్పులో ఉంచితే బతుకుతారని అలానే చేశారు. మహారాష్ట్ర జల్​గావ్​లో జరిగిందీ ఘటన.

ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?

By

Published : Aug 19, 2019, 11:44 AM IST

Updated : Sep 27, 2019, 12:12 PM IST

ఎప్పుడైనా చనిపోయిన వ్యక్తి బతికొచ్చిన సందర్భాలున్నాయా..? ఎక్కడైనా చూశారా..? అసలిది సాధ్యమా...? కాదు కదా..? మరి.. మహారాష్ట్ర జల్​గావ్​లో ఇది తప్పని నిరూపిద్దామనుకున్నారో ఏమో.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరిని తిరిగి బతికిద్దామనుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. జల్​గావ్​ మాస్టర్​ కాలనీ​కి చెందిన సోదరులు మహ్మద్​ ఒమర్​(12), అబోలైజ్​ అహ్మద్​(16) శుక్రవారం చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు శవపరీక్షల నిమిత్తం జల్​గావ్​లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. వీరికి పంచనామా నిర్వహించకుండా భౌతికకాయాల్ని క్వింటాల్​ ఉప్పుపై పడుకోబెట్టి.. మృతదేహాల్ని భద్రపరిచే గదిలో ఉంచడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.

ఇలా చేస్తే చనిపోయినా బతికొస్తారా...?

క్వింటాల్​ ఉప్పులో..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వెనుక మూఢనమ్మకాలే ప్రధాన కారణమట. మృతుల బంధువులు పిచ్చి నమ్మకంతో.. డాక్టర్లకు ఓ విన్నపం చేశారు. నీళ్లలో మునిగిపోయిన వారిని..3, 4 గంటల పాటు క్వింటాల్​ ఉప్పులో ఉంచితే బతుకుతారని, అలానే చేయాలని కోరారు.

సాధారణంగా.. రాత్రి దాటిన తర్వాత శవపరీక్షలు నిర్వహించరు. ఇక.. బాధిత కుటుంబం విజ్ఞప్తితో వారి ప్రతిపాదనకు ఒప్పుకున్నారు వైద్యులు. అలా రాత్రంతా ఇద్దరి మృతదేహాల్ని ఉప్పుపైనే పడుకోబెట్టారు. గంటలు గడిచినా... ఫలితం లేదు. బతుకుతారని ఆశపడ్డ కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఆఖరికి శనివారం ఉదయం.. వారిద్దరి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

పలు కోణాల్లో ఆరా...

సోషల్​ మీడియాలో వ్యాప్తి చెందిన ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు.. ఆసుపత్రి డీన్​​ వివరణ కోరారు. మృతదేహాలు రాత్రంతా మార్చురీలో ఉన్న కారణంగా.. ఈ ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు.

Last Updated : Sep 27, 2019, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details