ఈ మహాభారత అనువాది.. చదివేది ఏడో తరగతే ఒడిశా, జాజ్ పుర్ కు చెందిన ఓ బాలుడు లాక్ డౌన్ వేళ సమయాన్ని వృథా చేయకుండా.. మహాభారత అనువాదుకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
జాజ్ పుర్ ఖారమంగి గ్రామం, బడాచనా బ్లాక్ కు చెందిన ద్రకాంత్ సాహూ, జయంతి దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ సాహూ. శ్రీ ఔరోబిందా నోడల్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. లాక్ డౌన్ వేళ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు 250 పేజీల మహభారతాన్ని ఒడియా భాషలోకి అనువదించాడు.
అనువాదమే కదా.. ఎవరైనా చేస్తారనుకుంటే పొరపాటే. ఉదయ్ మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, అందులోని సారాన్ని ఒడిశా ప్రజలకు అందించాలనే సంకల్పంతోనే ఈ పని చేశాడు.
"మహాభారతం మనకెన్నో నేర్పుతుంది. శ్రీకృష్ణుడి సలహాలు, కర్ణుడి దయాహృదయం, యుధిష్టరుడి నిజాయతీ నన్ను ఆకట్టుకున్నాయి. నాకు అర్జుణుడి వ్యక్తిత్వం బాగా నచ్చుతుంది. ఆయన ఓ సాహసవీరుడు. నేను మహాభారత గాథను టీవీలో చాలా సార్లు చూశాను. అందుకే, ఈ లాక్ డౌన్లో నేను హిందూ పవిత్ర గ్రంథమైన మహాభారతాన్ని ఒడియా భాషలోకి అనువదించాను. మహాభారతాన్ని పూర్తిగా అనువదించడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టింది. గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఉపయోగించి నేను అనువాదం పూర్తి చేశాను." అని చెప్పాడు ఉదయ్.
పిల్లలు ఆడుతూ పాడుతూ.. కార్టూన్లు చూస్తూ గడిపేస్తున్న ఈ రోజుల్లో ఉదయ్ 12 ఏళ్ల వయసులోనే మహాభారతాన్ని అనువదించేసి అందరి మన్ననలు పొందుతున్నాడు.
ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్సుల వ్యాలిడిటీ పెంపు