బంగాల్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హావ్డాలో సీపీఐ యువజన, విద్యార్థి విభాగాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, సీపీఐ కార్యకర్తలకు జరిగిన ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సీపీఐ విభాగాలైన 'స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (ఎస్ఎఫ్ఐ), 'డెమొక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (డీవైఎఫ్ఐ) కార్యకర్తలు ఈ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగూరు నుంచి సచివాలయం వరకు ర్యాలీ చేపట్టారు.