భాజపా ఎంపీ అర్జున్‌సింగ్ పై దాడికి నిరసనగా బంద్ బంగాల్లో టీఎమ్సీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో భాజపా ఎంపీ అర్జున్ సింగ్ గాయపడ్డారు. తన తలను బైరక్‌పూర్ పోలీసు కమిషనర్ మనోజ్ గాయపరిచారని పేర్కొన్నారు. బైరక్‌పూర్‌లోని శ్యామ్‌నగర్ పార్టీ కార్యాలయంపై టీఎంసీ నియంత్రణ కలిగి ఉండటంపై భాజపా కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు. ఆందోళనలు విరమించాలని పోలీసులు చెప్పగా భాజపా కార్యకర్తలు వారితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో తృణమూల్, భాజపా కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా బైరక్‌పూర్ ఎంపీ తలకు బలంగా గాయమైందని పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర రక్త స్రావం అవుతున్న అర్జున్ సింగ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో పోలీసులతో పాటు, పలువురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు.
ఈ ఘటనను వ్యతిరేకిస్తూ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఎంపీ అర్జున్ సింగ్‌పై దాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 2న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బైరక్పూర్లో 12 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది.