బంగాల్లో నానాటికీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. సార్వత్రిక సమరం ముగిసినా అధికార తృణమూల్ పార్టీ, భాజపా మధ్య ఘర్షణ వాతావరణం చల్లారలేదు. తాజాగా రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులకు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
కోల్‌కతాలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్యకర్తలు బావ్బజార్ క్రాసింగ్‌కు చేరుకునేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆగ్రహించిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీసులపైకి రాళ్లు విసిరారు. అనంతరం అక్కడే బైఠాయించి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు.