తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాళ్లదాడిపై భాజపా- తృణమూల్​ మాటల యుద్ధం - రాళ్లదాడి

బంగాల్​ కోల్​కతాలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా కాన్వాయ్​పై జరిగిన రాళ్లదాడి.. కాషాయ, తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. భాజపాకు దక్కుతున్న ప్రజాదరణ తట్టుకోలేకే మమతా బెనర్జీ హింసకు తెరతీశారని అమిత్​ షా విమర్శించారు. ఈ ఘటనపై స్పందించిన దీదీ అమిత్​ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమిత్​షా ఓ గుండా..మమతా బెనర్జీ

By

Published : May 14, 2019, 10:07 PM IST

Updated : May 15, 2019, 4:40 PM IST

రాళ్లదాడిపై మాటల యుద్ధం

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా బంగాల్​ కోల్​కతాలో నిర్వహించిన రోడ్​షోలో ఉద్రిక్తతలు తలెత్తాయి.​ 'బిదాన్ సరని' హాస్టల్​ వద్ద కొంతమంది వామపక్ష, తృణమూల్​ కాంగ్రెస్ కార్యకర్తలు అమిత్​షా కాన్వాయ్​పై రాళ్లు రువ్వారు. నల్ల జెండాలతో అమిత్​షా 'గో బ్యాక్'​ అంటూ నినాదాలు చేశారు.

ఈ పరిణామంతో భాజపా కార్యకర్తలు ఆ హాస్టల్​కి తాళం వేసి, గెరావ్​ చేశారు. హాస్టల్​ బయట ఉన్న వాహనాలకు నిప్పు అంటించారు. రాళ్లు రువ్వారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ కళాశాల​ హాస్టల్​ భవనాన్ని, ప్రతిమనూ భాజపా కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఈ పరిణామాలతో మరోసారి బంగాల్​ భగ్గుమంది, వామపక్ష, తృణమూల్​ కాంగ్రెస్ ఛత్ర పరిషత్​ (టీఎమ్​సీపీ) కార్యకర్తలు ప్రతిదాడి చేశారు. ఘర్షణ పెరిగి ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. తక్షణం స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

'మమత దాడి చేయించారు'

అమిత్​షా తన కాన్వాయ్​పై జరిగిన దాడికి బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణమని ఆరోపించారు.

"కోల్​కతాలోని ప్రజలందరూ రోడ్లపైనే ఉన్నారు. దాదాపు 8 కి.మీ వరకు కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఇది చూసి తట్టుకోలేక.. మమతా నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన గూండాలు అడ్డగించారు. నా కాన్వాయ్​కు 200 మీటర్ల దూరంలో ఓ వైద్య కళాశాల ఉంది. అక్కడ గొడవ మొదలైంది. రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. ఈ విధమైన హింసను మమతా బెనర్జీ సర్కారు పెంచుతోంది. అలానే బంగాల్​ ప్రజలను నేను కోరేది ఒకటే... ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ హింసకు మీరు... శాంతితో, ఓటుతో సమాధానం ఇవ్వాలి. "- అమిత్​షా , భాజపా జాతీయ అధ్యక్షుడు

ఆ సమయంలో పోలీసులు ఏమీ పట్టనట్లు వ్యవహరించారని, స్వామి వివేకానంద నివాసానికి తాను వెళ్లకుండా, తప్పు దారిపట్టించారని అమిత్​షా ఆరోపించారు.

'అమిత్​షాని ఏమనాలి'

అమిత్​షా ఆరోపణలను తిప్పికొట్టారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. కమల దళపతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యాసాగర్​ విగ్రహాన్ని భాజపా కార్యకర్తలు ధ్వంసం చేయడంపై బెహాలా ర్యాలీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా గురువారం ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

"మీరు విద్యాసాగర్​ (బంగాల్​ పునరుజ్జీవన ఉద్యమకారుడు) మీద చేతులు వేస్తే మిమ్మల్ని ఏమనాలి. నేను మీ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని ద్వేషిస్తాను."-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: వరుణుడి రాక ఆలస్యం- లోటు వర్షపాతం!

Last Updated : May 15, 2019, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details