బంగాల్ ఉత్తర దినాజ్పుర్లోని కలగచ్‌లో ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యకు నిరసనగా స్థానికులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
బాలిక హత్యాచారంపై నిరసన- వాహనాలు దగ్ధం
బంగాల్లో ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు అనేక వాహనాలను తగలబెట్టారు.
ఆ రాష్ట్రంలో హింసాత్మకంగా మారిన నిరసనలు
బాలికకు న్యాయం చేయాలని కోరుతూ రహదారిపై వాహనాల రాకపోకలు అడ్డుకున్న స్థానికుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. బస్సులు, ఇతర వాహనాలు తగలబెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయువు ప్రయోగించారు.
ఇదీ చూడండి:తమిళనాడు, యూపీలో రికార్డు స్థాయిలో కేసులు