మధ్యప్రదేశ్ పన్నా జిల్లాకు చెందిన సునియాబాయి అనే మహిళ.. 24 ఏళ్ల తన కుమారున్ని గొడ్డలితో నరికి చంపింది. తాను దేవతనని చెప్పుకుంటూ అందివచ్చిన కొడుకుని బలితీసుకుందని పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగే సమయంలో ఆమె భర్త ఇంట్లోనే నిద్రపోతున్నట్లు స్థానికులు తెలిపారు.
కన్న కొడుకునే బలిచ్చిన కర్కశ తల్లి - Madhya Pradesh crime news
మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లే కుమారుడిని గొడ్డలితో నరికి చంపింది. తనకు తాను దేవతలా భావించి నరబలిగా ప్రాణం తీసింది.
కన్న కొడుకునే బలిచ్చిన కర్కశ తల్లి
కొంతకాలంగా రాత్రిపూట పూజలు చేస్తున్న నిందితురాలు.. బుధవారం ఉదయం అలానే చేసి కుమారుడిని హతమార్చిందని అధికారులు తెలిపారు. ఆమె దాడి చేసిన ఆయుధాన్ని సీజ్ చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇదీ చూడండి: డ్రగ్స్ తీసుకోవాలంటూ భర్త బలవంతం- భార్య ఫిర్యాదు
Last Updated : Oct 22, 2020, 7:51 PM IST