తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమల వివాదం: 13నుంచి రివ్యూ పిటిషన్ల​ విచారణ

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ​ ఈ నెల 13 నుంచి జరగనుంది. దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో ఇప్పటికే 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది.

SABARIMALA
శబరిమల వివాదం

By

Published : Jan 8, 2020, 5:33 AM IST

Updated : Jan 8, 2020, 5:47 AM IST

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించే విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టులో 9 మంది సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. ఈనెల 13 నుంచి ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది అత్యున్నత న్యాయస్థానం.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​.ఏ.బోబ్డే ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించనున్నారు. జస్టిస్‌ బానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎల్‌.ఎన్‌.రావు, జస్టిస్‌ శాంతన గౌదర్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.రెడ్డి, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్​లు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన వారికి ఈ మేరకు నోటీసులు ఇచ్చింది ధర్మాసనం. 2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఇదీ చూడండి: 'ముసుగు వ్యక్తుల సమాచారముంటే మాకివ్వండి'

Last Updated : Jan 8, 2020, 5:47 AM IST

ABOUT THE AUTHOR

...view details