తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బాబ్​డే! - జస్టిస్​ రంజన్ గొగొయ్​

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తదుపరి సీజేఐగా జస్టిస్​ ఎస్​ఏ బాబ్​డేను సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు ఉత్తరం అందించారు. గతేడాది సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్​ గొగొయ్.. నవంబర్​ 17న పదవీ విరమణ చేయనున్నారు.​

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బాబ్​డే!

By

Published : Oct 18, 2019, 12:03 PM IST

Updated : Oct 18, 2019, 12:10 PM IST

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎస్​ఏ బాబ్​డేను సిఫార్సు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్​ రంజన్​ గొగొయ్​. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఆయన ఉత్తరం పంపారు.

46వ భారత ప్రధాన న్యాయమూర్తిగా 2018 అక్టోబర్​ 3న ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్​ గొగొయ్​. 13నెలల 15 రోజులు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం.. ఈ ఏడాది నవంబర్​ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నవంబర్​ 18న తదుపరి సీజేఐగా జస్టిస్​ బాబ్​డే బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఇదే జరిగితే జస్టిస్ బాబ్​డే 18 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.

రాష్ట్రపతిదే తుది నిర్ణయం

సంప్రదాయం ప్రకారం ప్రస్తుతమున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. పదవీ విరమణ చేయడానికి ముందు తదుపరి సీజీఐని సూచించాలి. ఆయన ప్రతిపాదనను న్యాయశాఖ మంత్రి.. ప్రధాన మంత్రి ముందు ఉంచుతారు. సీజేఐ అంశంపై ప్రధానితో చర్చించిన అనంతరం రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారు.

ఇదీ చూడండి: 7 అడుగుల కొండచిలువ చేతిలో జింక బలి

Last Updated : Oct 18, 2019, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details