ఆదివారం పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నూతన రికార్డు నెలకొల్పారు. దేశంలోని 650మంది న్యాయమూర్తులు, 15 వేలమంది జిల్లా, తాలుకా న్యాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంభాషించారు. కోర్టుల్లో సరైన మౌలిక వసతులు లేవని పేర్కొన్న ఆయన కొంతమంది న్యాయవాదులతో.. న్యాయాధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానించారు.
ఉద్యోగంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను అధిగమించి మరింత సంకల్పంతో న్యాయమూర్తులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జడ్జిలు పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేస్తున్నారంటూ అభినందించారు జస్టిస్ గొగొయి. న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ జాతి నిర్మాతలని అభిప్రాయపడ్డారు.
ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీకాలం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు జస్టిస్ గొగొయి.