తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపునకు పిటిషన్​ - మథుర ఆలం

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈద్గాను తొలగించాలంటూ అక్కడి న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు ఐదుగురు న్యాయవాదులు. ఈ కేసుపై న్యాయస్థానం సోమవారం విచారణ జరపనుంది.

Civil suit filed for removing Idgah from Shri Krishna Janmabhoomi
శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపునకు పిటిషన్​

By

Published : Sep 27, 2020, 6:00 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి కత్రా కేశవ్​దేవ్​ ఆలయ ప్రాంగణంలో ఉన్న 17వ శతాబ్దం నాటి ఈద్గాను తొలగించాలని కోరుతూ ఐదుగురు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రంజనా అగ్నిహోత్రి, పర్వేశ్​ కుమార్​, రాజేశ్​ మణిత్రిపాఠి, కరుణేశ్​ కుమార్​ శుక్లా, శివాజీ సింగ్​, త్రిపురరీ తివారీ ఇక్కడి జిల్లా న్యాయస్థానంలో శనివారం పిటిషన్​ దాఖలు చేశారు.

ఈ కేసుపై సోమవారం ఉదయం న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ కేసులో యూపీ సున్నీ సెంట్రల్​ వక్ఫ్​ బోర్డు, షాహీ మస్జిద్​ ఈద్గా నిర్వహణ కమిటీలతో పాటు శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్​(మథుర), శ్రీకృష్ణ జన్మస్థాన్​ సేవా సంస్థాన్​లను కూడా ప్రతివాదులుగా పిటిషనర్లు చేర్చారు.

శ్రీకృష్ణ జన్మభూమి మొత్తం 13.70 ఎకరాల భూమిలో ఉంది. మసీదు నుంచి ఆలయాన్ని వేరు చేసేందుకు ఉద్యమం చేపడతామని హిందూ ఆర్మీ చీఫ్​ సంగథన్​ హెచ్చరించింది. అనంతరం సంగథన్​ అధ్యక్షుడు మనీశ్​ యాదవ్​తో పాటు మరో 21మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:-రామమందిర నిర్మాణం.. 2024 ఎన్నికల వ్యూహమేనా?

ABOUT THE AUTHOR

...view details