తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు- ఆమోదం లాంఛనమే!

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును నేడు రాజ్యసభ ముందుకు తీసుకురానుంది ప్రభుత్వం. ఇప్పటికే లోక్​సభలో నెగ్గిన బిల్లును.. అన్నాడీఎంకే, వైకాపా, తెదేపా, బీజేడీ వంటీ పార్టీల మద్దతు కూడగట్టి రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఆమోదంపై ధీమా వ్యక్తం చేస్తోంది.

CITIZENSHIP BILL PLACED IN RAJSABHA TODAY
నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు- ఆమోదం లాంఛనమేనా?

By

Published : Dec 11, 2019, 5:41 AM IST

నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు- ఆమోదం లాంఛనమేనా?

వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019ను ఈరోజు రాజ్యసభలో ప్రవేశపట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇతర పార్టీల మద్దతుతో బిల్లును ఆమోదింపచేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది అధికార భాజపా.

పార్లమెంట్​ దిగువసభలో అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నందున సోమవారం సుదీర్ఘ చర్చ అనంతరం పౌరసత్వ బిల్లు ఆమోదం పొందింది. ఎన్డీఏకి మద్దతుగా ఇతర పార్టీలు నిలుస్తున్న కారణంగా రాజ్యసభలోనూ ఈ బిల్లు నెగ్గుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం రాజ్యసభలో 238 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏకి 105 మంది బలం ఉంది. అందులో భాజపా 83, జనతాదళ్​(యూ) 6, శిరోమణి అకాలి దళ్​ 3, ఎల్​జేపీ, ఆర్​పీఐ(ఏ)కు తలాఒకటి, 11 మంది నామినేటేడ్​ ఎంపీలు ఉన్నారు.

మొత్తం 127 మంది సభ్యుల మద్దతు!

బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలనే లక్ష్యంతో ఉంది భాజపా. ఇప్పటికే అన్నాడీఎంకే(11), బీజేడీ(7), వైకాపా(2), తేదేపా(2)తో చర్చలు చేపట్టింది. బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ పార్టీలన్నీ లోక్​సభలో బిల్లుకు మద్దతుగా నిలిచిన కారణంగా రాజ్యసభలోనూ అండగా నిలుస్తాయనే విశ్వాసంతో ఉంది భాజపా.
ఈ నాలుగు పార్టీల మద్దతుతో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి 127 మంది సభ్యుల బలం ఉంటుంది. ఇది సాధారణ మెజారిటీ 120 కన్నా ఎక్కువ. కనుక బిల్లు రాజ్యసభలోనూ నెగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details