మోదీ కృతజ్ఞతలు..
సుదీర్ఘ చర్చ తర్వాత పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదంచిందని హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. బిల్లుకు మద్దతు తెలిపిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు శతాబ్దాల మానవతా విలువలకు అనుగుణంగా ఉందన్నారు.
00:13 December 10
మోదీ కృతజ్ఞతలు..
సుదీర్ఘ చర్చ తర్వాత పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదంచిందని హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. బిల్లుకు మద్దతు తెలిపిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు శతాబ్దాల మానవతా విలువలకు అనుగుణంగా ఉందన్నారు.
00:07 December 10
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా311 ఓట్లు నమోదయ్యాయి. వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి.
23:53 December 09
ఓటింగ్ ప్రారంభం
పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. విభజన ఓటు ద్వారా ఓటింగ్‌ను చేపడుతున్నారు స్పీకర్ ఓం బిర్లా.
23:22 December 09
23:22 December 09
23:01 December 09
పౌర సవరణ బిల్లుపై అమిత్‌షా వివరణ
బిల్లు ఏవిధంగానూ రాజ్యాంగ విరుద్ధం కాదు: అమిత్‌షా
శరణార్థులు హక్కులు కోల్పోరు: అమిత్‌షా
శరణార్థుల హక్కులను బిల్లు కాపాడుతుంది: అమిత్‌షా
పౌరసత్వ సవరణ బిల్లు చట్ట వ్యతిరేకం కాదు: అమిత్ షా
ఈ బిల్లు ఆర్టికల్ 14ను ఉల్లంఘించదు: అమిత్ షా
22:46 December 09
'దేశ విభజనకు దారి తీస్తుంది'
పౌరసత్వ సవరణ చట్టం బిల్లు మరో దేశ విభజనకు దారి తీస్తుందన్నారు ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ. బిల్లు పూర్తిగా వివక్షపూరితమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పీఠిక సారాంశానికి వ్యతిరేకంగా ప్రతిపాదిత బిల్లు ఉందని తెలిపారు.
20:34 December 09
'వివక్ష పూరితం'
పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభ వేదికగా స్పందించారు కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలోనే మార్పులు చేయడం ద్వారా శరణార్థులకు ప్రయోజనం చేకూర్చవచ్చని పేర్కొన్నారు. వివక్షతో కూడిన మరో చట్టం అవసరం లేదని వ్యాఖ్యానించారు.
20:13 December 09
'ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేదు'
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె. ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ప్రతిపాదిత చట్టం సుప్రీంకోర్టులో న్యాయపరీక్షకు నిలవలేదని.. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.
20:09 December 09
'రాజ్యాంగ విరుద్ధం'
20:02 December 09
పౌరసత్వ బిల్లుకు తెరాస వ్యతిరేకం...
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభలో స్పష్టం చేసింది తెరాస. తమ పార్టీ లౌకిక విధానాలకు.. బిల్లు విరుద్ధంగా ఉందని.... రాజ్యాంగ దృక్పథం, నిబంధనల్ని తెరాస కచ్చితంగా పాటిస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ ఎంపీ నామ నాగేశ్వరరావు.
19:46 December 09
పౌరసత్వ బిల్లుకు జేడీయూ, బీజేడీ మద్దతు..!
వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పలు ప్రాంతీయ పార్టీలూ కొన్ని షరతులతో మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే వైకాపా మద్దతిచ్చింది. తాజాగా జేడీయూ, బీజేడీ కూడా మద్దతిస్తున్నట్లు సంకేతాలిచ్చాయి. పాకిస్థానీ మైనార్టీలకు కూడా.. భారత పౌరసత్వం కల్పించే అంశంపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్.
బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన బీజేడీ.. గతంలో వచ్చిన నివేదికలను దృష్టిలో పెట్టుకొని శ్రీలంకను కూడా ఇందులో చేర్చాలని కోరింది. అదే విధంగా బిల్లు.. ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని వస్తున్న అపార్థాలను ప్రభుత్వం తొలగించాలని అభిప్రాయపడింది.
18:59 December 09
పౌరసత్వ బిల్లుపై వైకాపా మద్దతు... కానీ..
18:32 December 09
పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతుంది. బిల్లుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బిల్లు ద్వారా మైనార్టీలు హక్కులు పొందుతారని పేర్కొన్నారు.
17:05 December 09
పౌరసత్వ బిల్లుపై లోక్‌సభలో మాటల యుద్ధం
వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు నాటకీయ పరిణామాల మధ్య లోక్‌సభ ముందుకొచ్చింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అధికార పక్షంపై మాటల దాడికి దిగాయి విపక్షాలు. బిల్లును సభలో ప్రవేశపెట్టాలో లేదో తేల్చేందుకు ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టాయి. విపక్షాల ఆరోపణల్ని తిప్పికొట్టిన కేంద్రం... 293-82 ఓట్ల తేడాతో పౌరసత్వ బిల్లును దిగువసభలో ప్రవేశపెట్టింది.
అధికార, విపక్షాల మాటల యుద్ధం, అసాధారణ రీతిలో ఓటింగ్ వంటి పరిణామాల మధ్య వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. దిగువసభలో బిల్లు ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించగానే... విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో స్పందించారు.
'మైనార్టీలే లక్ష్యంగా...'
మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు.
''దేశంలోని మైనార్టీ ప్రజలే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించారు తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్య, సార్వభౌమ, లౌకిక రాజ్యంగా భారత్ ఉండాలని ప్రజలందరూ సంకల్పించుకున్నారు. దేశంలోని ప్రజలందరికీ రక్షణ, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ పొందే హక్కు ఉంది.''
- అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ పక్ష నేత
అధిర్‌తో పాటు.. విపక్షాల సభ్యులు సౌగత్ రాయ్, ఎన్కే ప్రేమ్‌చంద్రన్, గౌరవ్ గొగొయి, శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.
''పౌరసత్వ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గణతంత్ర మూల విలువలపై దాడి చేసేలా ఉంది. జాతీయ అంశాలను సైద్ధాంతిక, మతపరంగా, భౌగోళికంగా, భాషపరంగా విభజించలేం. మతమే జాతీయతకు గుర్తింపా? అలా భావించేవారు పాకిస్థాన్ ఏర్పాటు చేసుకున్నారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేడ్కర్, మౌలానా ఆజాద్ తదితరులు మతం ఆధారంగా దేశాన్ని విభజించకూడదని, ఈ దేశం అందరిదని చెప్పారు. అందువల్ల రాజ్యాంగ మూలసూత్రాలకు వ్యతిరేకంగా, వివక్షపూరితంగా ఈ బిల్లును రూపకల్పన చేశారు. ఈ బిల్లుపై చర్చ అవసరం లేదని నమ్ముతూ దీన్ని ముందుకు పంపరాదని విజ్ఞప్తి చేస్తున్నా.''
- శశిథరూర్, కాంగ్రెస్ నేత
విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు అమిత్ షా. దేశంలోకి అక్రమ వలసల్ని నిరోధించేందుకే బిల్లు తీసుకొచ్చినట్లు స్పష్టంచేశారు.
''ఈ బిల్లు కనీసం .001 శాతం కూడా దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకంగా లేదు. బిల్లుపై చర్చ జరగాల్సిన అవసరముంది. బిల్లులోని ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.''
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో పౌరసత్వానికి కటాఫ్ పెట్టలేదా అని షా ప్రశ్నించారు. పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లోనే మైనారిటీలకు రక్షణ ఎక్కువ ఉందని స్పష్టంచేశారు. 1971లో బంగ్లాదేశ్ శరణార్థులకు ఇందిరాగాంధీ పౌరసత్వం ఇచ్చారని గుర్తుచేశారు.
ఓటింగ్‌తో బిల్లు ప్రవేశం..
అసాధారణ రీతిలో బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. బిల్లుకు అనుకూలంగా 293, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి.
బిల్లులో ఏముంది..?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లింయేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 నాటికి భారత్‌కు అక్రమంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తారు.
16:55 December 09
13:42 December 09
పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్.. అనుకూలంగా తీర్పు
13:25 December 09
అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ బిల్లు: షా
13:00 December 09
బిల్లు రాజ్యాంగ విరుద్ధం: తృణమూల్
పౌరసత్వ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా స్పందించారు.
12:59 December 09
బిల్లు.. రాజ్యాంగ ప్రవేశికకు వ్యతిరేకం: థరూర్
పౌరసత్వ బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతుంది. విపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తేలేదని అమిత్ షా వ్యాఖ్యానించారు.
12:46 December 09
ముస్లింలకు ఏం వ్యతిరేకం కాదు: షా
12:40 December 09
పౌరసత్వ బిల్లుపై విపక్షాల ఆగ్రహం
పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం చర్చ కొనసాగుతోంది. బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి.. బిల్లు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.
12:32 December 09
బిల్లుపై వాడీవేడి చర్చ
12:30 December 09
ప్రతి అంశంపై సమాధానం ఇస్తాం: షా
పౌరసత్వ చట్టసవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ఇవాళ చర్చ కొనసాగనుంది. అధికార భాజపాకు మెజార్టీ ఉన్నందున సులువుగానే ఆమోదం పొందే అవకాశముంది. అయితే.. బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దిల్లీలోనూ పలు యూనియన్లు నిరసనలు చేస్తున్నారు.
12:18 December 09
లోక్‌సభలో పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టిన అమిత్‌షా
పౌరసత్వ చట్టసవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ఇవాళ చర్చ కొనసాగనుంది. అధికార భాజపాకు మెజార్టీ ఉన్నందున సులువుగానే ఆమోదం పొందే అవకాశముంది. అయితే.. బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దిల్లీలోనూ పలు యూనియన్లు నిరసనలు చేస్తున్నారు.
12:12 December 09
పౌరసత్వ బిల్లు ఆమోదంపై భాజపా పార్లమెంటరీ పార్టీ కసరత్తులు
12:00 December 09
జంతర్‌మంతర్ వద్ద ఏఐయూడీఎఫ్ ధర్నా
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఏఐయూడీఎఫ్(ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్)... దిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగింది.
11:56 December 09
ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు..
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా త్రిపురలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు.
11:43 December 09
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును మరికాసేపట్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు వర్గాలు సహా... కాంగ్రెస్, తృణమూల్ నుంచి బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.