తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ముడుపుల' రాతలపై రాజకీయ రగడ - Congress

రెండేళ్ల క్రితం నాటి ఓ డైరీ... రాజకీయ దుమారానికి కారణమైంది. భాజపా అగ్రనేతలకు యడ్యూరప్ప ముడుపులు ఇచ్చినట్లు ఆ డైరీ ఆధారంగా వచ్చిన వార్తలను విమర్శనాస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్. లోక్​పాల్​ దర్యాప్తునకు డిమాండ్ చేసింది. ఆరోపణలను యడ్యూరప్ప తోసిపుచ్చారు.

'ముడుపుల' రాతలపై రాజకీయ రగడ

By

Published : Mar 22, 2019, 6:48 PM IST

Updated : Mar 22, 2019, 7:24 PM IST

'ముడుపుల' రాతలపై రాజకీయ రగడ
భాజపా అగ్రనేతలకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్​ యడ్యూరప్ప రూ.1800కోట్లు చెల్లించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. సోదాల సందర్భంగా ఆదాయ పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న డైరీలో ఈ వివరాలు ఉన్నాయంటూ ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఈ వార్తను ఆసరాగా చేసుకుని... భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది కాంగ్రెస్​. భాజపా నేతలంతా అవినీతిపరులేనని విమర్శించింది. ఈ కేసులో ప్రధాని సహా భాజపా నేతలపై లోక్​పాల్​ విచారణ చేపట్టాలని డిమాండ్​ చేసింది.

" ఒక పత్రిక​ ఈ డైరీని విడుదల చేసింది. ఇందులోని ప్రతి పేజీలో​ యడ్యూరప్ప సంతకం ఉంది. ఇది కచ్చితంగా దర్యాప్తు చేయవల్సిన అంశం. 2017 నుంచి ఈ డైరీ ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై మోదీ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదని కచ్చితంగా ప్రశ్నించాలి. ఇప్పుడు ఈ డైరీ బయటకు వచ్చింది. ఇందులో ఉన్న సమాచారం నిజమా కాదా అనేది ప్రధాని తేల్చాలి. "
- రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

ఖండించిన యడ్యూరప్ప

వార్తా కథనాల ఆధారంగా కాంగ్రెస్​ చేసిన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. మోదీకున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

"కాంగ్రెస్​ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. కోట్ల రూపాయలు చెల్లించానన్న ఆరోపణలపై ఇదివరకే దర్యాప్తు జరిగింది. పత్రాలు నకిలీవని తేలింది. వాటిలోని సమాచారం, చేతి రాత, సంతకాలు పూర్తిగా ఫోర్జరీ చేసినవని ఆదాయపన్ను శాఖ అధికారులు తేల్చారు. కాంగ్రెస్​ అసత్య ఆరోపణలు చేస్తోంది.
- బీఎస్​ యడ్యూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

Last Updated : Mar 22, 2019, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details