తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ సైనికులకు తీపికబురు..1.2 లక్షల ఉద్యోగాలు! - MHA LATEST NEWS

కేంద్ర బలగాల విశ్రాంత ఉద్యోగుల్లోని 1.2 లక్షల మంది సేవలను వినియోగించుకోవాలని సీఐఎస్​ఎఫ్​ భావిస్తోంది. వీరందరినీ అయిదేళ్ల పాటు ఒప్పంద పద్ధతిలో నియమించనుంది.

మాజీ సైనికులకు తీపికబురు..1.2 లక్షల ఉద్యోగాలు!

By

Published : Nov 21, 2019, 1:55 PM IST

సైన్యం, వివిధ కేంద్ర బలగాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులకు కేంద్ర హోమంత్రిత్వ శాఖ శుభవార్త తెలిపింది. 1.2 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులకు అయిదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. దేశంలో ఈ తరహా నియామకాలు జరగడం ఇదే తొలిసారి. ఈ నియామకాలకు సంబంధించిన మార్గసూచీని రూపొందించింది కేంద్ర పారిశ్రమిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్​). 1.2 లక్షల విశ్రాంత ఉద్యోగుల నియామకంతో సీఐఎస్​ఎఫ్ బలం 3 లక్షలకు చేరి మరింత పటిష్ఠమవనుంది.

ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతున్న నేపథ్యంలో ఆయా పరిశ్రమల్లో భద్రతా విధులు నిర్వర్తించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అవసరమవుతోంది. సీఐఎస్ఎఫ్​కు అదనంగా ఉద్యోగులు కావాలనే ప్రతిపాదనను ఆ సంస్థ ఐజీ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పంపించారు.

మాజీ సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని సెప్టెంబరు 23న జరిగిన సమావేశంలో సీఐఎస్ఎఫ్ అధికారులకు సూచించారు హోంమంత్రి అమిత్ షా.

ఇదీ చూడండి: సేనతో 'మహా'ప్రభుత్వ ఏర్పాటుపై రేపే కాంగ్రెస్ ప్రకటన

ABOUT THE AUTHOR

...view details