ఇవాళ జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 125వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా 'గెట్టింగ్ గ్రోత్ బ్యాక్'(వృద్ధిని తిరిగి సాధించడం) అనే అంశంపై మోదీ ప్రసంగించనున్నారు. లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా మూతపడిన కంపెనీలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మోదీ ప్రసంగానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత పరిశ్రమల సమాఖ్య 1895లో ప్రారంభమైంది. ఈ ఏడాదికి 125 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంస్థ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజంతా ఈ కార్యక్రమం జరగనుంది.