కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనను విచారించేందుకు సీబీఐకి కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ అనుమతి మంజూరు చేసింది. త్వరలో చిదంబరాన్ని సీబీఐ విచారణకు పిలిచే అవకాశం ఉంది.
చిదంబరానికి ఎదురుదెబ్బ - కేంద్ర మాజీ ఆర్థికమంత్రి
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరాన్ని విచారించేందుకు సీబీఐకి కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ అనుమతి మంజూరు చేసింది.
![చిదంబరానికి ఎదురుదెబ్బ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2353342-529-135cef48-23e3-4bd4-8b0d-ca69e42345eb.jpg)
చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడైన కార్తీ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కార్తీని గతేడాది అరెస్టు చేసింది. మార్చిలో ఆయనకు బెయిల్ లభించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, పాస్‌పోర్టును ట్రయల్‌కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.
ఇప్పుడు చిదంబరాన్ని ప్రశ్నించేందుకు సీబీఐకి న్యాయమంత్రిత్వశాఖ అనుమతిచ్చిన నేపథ్యంలో విచారణ ఊపందుకునే అవకాశం ఉంది.