సీఐసీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని బోర్డు కార్యదర్శి అరథూన్ తెలిపారు. ఎస్ఎంఎస్ల ద్వారా కూడా విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.
ఈ నెల 10న సీఐసీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు - CICSE news
10, 12వ తరగతి ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు సీఐసీఎస్ఈ ప్రకటించింది. బోర్డు అధికారిక వెబ్సైట్లో, ఎస్ఎంఎస్ల ద్వాారా విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
సీఐసీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు
ఈ ఏడాది వేసవిలో నిర్వహించాల్సిన 10, 12వ తరగతి పరీక్షలు కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడి రద్దయ్యాయి. గత పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించనున్నారు. మూడు పరీక్షల్లో సగటు ఆధారంగా ఫైనల్ మార్కులు ఉంటాయి. ఇంటర్నల్ మార్కులు, ప్రాజెక్టు వర్కును కూడా పరిగణలోకి తీసుకుంటారు.