తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఐసీలో చతుర్వేది అప్పీలుపై విచారణ వాయిదా

సామాజిక కార్యకర్త పీఎంఓపై చేసిన అప్పీలు విచారణను వాయిదా వేసింది కేంద్ర సమాచార కార్యాలయం. కేంద్ర మంత్రులపై వచ్చిన ఆరోపణల సమాచారాన్ని ఇవ్వాలన్న అభ్యర్థనను ప్రధాని కార్యాలయం తిరస్కరించటంతో సీఐసీలో పిటిషన్​ దాఖలు చేశారు చతుర్వేది.

సీఐసీలో చతుర్వేది అప్పీలుపై విచారణ వాయిదా

By

Published : May 3, 2019, 11:17 PM IST

కేంద్ర మంత్రుల అవినీతి సంబంధించిన కీలక అప్పీలుపై వాదనలను కేంద్ర సమాచార కార్యాలయం(సీఐసీ) వాయిదా వేసింది. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వటానికి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నిరాకరించిన విషయంలో ఈ పిటిషన్​ దాఖలైంది. దీనిపై శుక్రవారం వాదనలు వినాల్సి ఉన్నా సమయాభావం కారణంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సీఐసీ.

కేంద్రమంత్రులపై వచ్చిన ఆరోపణల వివరాలు అందివ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద ప్రజావేగు, ప్రభుత్వోద్యోగి సంజీవ్ చతుర్వేది దరఖాస్తు చేశారు. ఈ విషయమై వివరాలు ఇవ్వాలంటూ సీఐసీ ఆదేశాలున్నా పీఎంఓ అందుకు నిరాకరించింది.

"కేంద్ర మంత్రులపై వివిధ రకాల ఫిర్యాదులు వస్తాయి. అందులో అవినీతితో పాటు ఇతర విషయాలూ ఉంటాయి. వీటిని వర్గీకరించటం క్లిష్టమైన​ విషయం" అంటూ సమాచార హక్కు చట్టంలోని సెక్షన్​ 7(9)ను ఉటంకించింది పీఎంఓ.

ఈ సెక్షన్​ ప్రకారం సమాచారాన్ని అడిగిన రూపంలోనే అందించాలి. అభ్యర్థనతో ప్రభుత్వ వనరులు, వాటి రక్షణకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లయితే సమాచారం ఇచ్చేందుకు విముఖత చూపేందుకు ఆ విభాగానికి అధికారం ఉంటుంది.

ఇదీ చూడండి: ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు

ABOUT THE AUTHOR

...view details