కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న పోలీసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. వైరస్‌పై పోరులో ముందుడి నడుస్తూ.. అహర్నిశలు కృషి చేస్తున్న వారు అదే మహమ్మారితో బలైపోతున్నారు.
తాజాగా చెన్నైలోని మాంబలం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలమురగన్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితం వైరస్ పాజిటివ్‌గా రాగా.. చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం కన్నుమూశారు.