అయోధ్య రామమందిర నిర్మాణం కోసం కర్ణాటకలోని క్రైస్తవ కమ్యూనిటీ రూ.కోటి విరాళం ఇచ్చినట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సీఎన్ అశ్వంత్ నారాయణ్ తెలిపారు. 'నిధి సమర్పణ అభియాన్'లో భాగంగా వారు ఈ విరాళం అందించినట్లు ఓ సమావేశంలో వెల్లడించారు. ఈ సమవేశంలో క్రైస్తవ మతపెద్దలు, పారిశ్రామిక, వ్యాపార వేత్తలు, ఎన్ఆర్ఐలు, సహా పలు సంస్థల సీఈఓలు పాల్గొన్నారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు భాజపా.. ప్రజల అనుకూల చర్యలను, సబ్ కా సాత్, సబ్ కా వికాస్‌ను నమ్ముతుంది. ఇది అన్ని మైనారిటీలతో కూడిన పార్టీ. ఈ పరిపాలన తత్వాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనుసరిస్తున్నాయి" అని నారాయణ్ పేర్కొన్నారు.