తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2019, 7:25 AM IST

ETV Bharat / bharat

కోల్​కతా మాజీ సీపీపై మరోసారి సుప్రీంకు సీబీఐ

కోల్​కతా మాజీ పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ అరెస్టుపై విధించిన స్టేను తొలగించాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు వాదనలు జరగనున్నాయి.

కోల్​కతా మాజీ సీపీపై మరోసారి సుప్రీంకు సీబీఐ

కోల్​కతా మాజీ సీపీపై మరోసారి సుప్రీంకు సీబీఐ

శారదా కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టింది. కోల్​కతా మాజీ పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ అరెస్టుపై ఫిబ్రవరి 5న విధించిన స్టేను తొలగించాలని అభ్యర్థించింది. ఆయనను కస్టడీకి తీసుకొని విచారించేందుకు అనుమతివ్వాలని సుప్రీంను కోరింది సీబీఐ.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ నేతృత్వంలోని ధర్మాసనం నేడు సీబీఐ అభ్యర్థనలపై వాదనలు విననుంది.

సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలని, దర్యాప్తునకు ఎలాంటి సమస్యలు సృష్టించకూడదని పశ్చిమ్​ బంగ అధికారులకు సుప్రీంకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తప్పకుండా అనుసరించేలా అధికారులను ఆదేశించాలని సీబీఐ కోరింది.

భౌతిక ఆధారాలను సేకరించటం సహా శారదా కుంభకోణం విచారణలో లభించిన​ సాక్ష్యాలను దాచి ఉంచిన అంశాలపై కోల్​కతా మాజీ సీపీ రాజీవ్​కుమార్​ సహా మరికొందరిని విచారించాల్సిన అవసరం ఉంది - సీబీఐ

ABOUT THE AUTHOR

...view details