తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అ​వినీతికి పాల్పడినవారు జైలుకే: చిరాగ్‌

బిహార్​లో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అధికార, విపక్ష పార్టీలు విమర్శల జోరు పెంచాయి. ఈ క్రమంలో ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​, ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​పై విరుచుకుపడ్డారు. ఈ ఐదేళ్లలో అవినీతికి పాల్పడిన వారిని అధికారంలోకి రాగానే జైలుకు పంపుతామన్నారు.

Chirag Paswans Fresh Attack On Nitish-Kumar
బిహార్ బరి: అ​వినీతికి పాల్పడిన వారు జైలుకే: చిరాగ్‌

By

Published : Oct 22, 2020, 9:05 PM IST

బిహార్‌లోని అధికార కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) అధినేత చిరాగ్ పాసవాన్..‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ఐదేళ్లలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ వరస ట్వీట్లలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగా, ఆ రాష్ట్రంలో అక్టోబర్‌ 28 నుంచి మూడు దశలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

"అభివృద్ధి పనుల అంశంలో ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలి. ఈ ఐదేళ్ల నితీశ్ పాలనలో బ్యూరోక్రసీ, ఏడు హామీల ప్రణాళికలో అవినీతి మాత్రమే ఉంది. మేం అధికారంలోకి రాగానే ఆ అవినీతిపై దర్యాప్తు చేపట్టి, కారకులైన వారిని జైలుకు పంపుతాం"

-- చిరాగ్ పాసవాన్​ ట్వీట్

బిహార్‌లో మార్పు తెచ్చేందుకు వచ్చే 20 రోజులు కీలకమని పేర్కొంటూ.. నితీశ్‌ కుమార్‌ను గద్దె దించాలని గట్టి సందేశం ఇచ్చారు.

తండ్రి లేకపోవడం వల్ల ఒంటరిగా..

బుధవారం రాత్రి గయలోని అత్రి నియోజకవర్గంలో చిరాగ్​ ప్రసంగిస్తూ.. తన తండ్రి వెంట లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవని, తనకు ఒంటరిగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే, ప్రజల అంచనాలు అందుకునేలా పనిచేస్తాని వెల్లడించారు.

మరోవైపు, తమకు చిరాగ్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదని భాజపా చెప్తున్నప్పటికీ ఆయన ప్రధాని మోదీపై తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: 'ఎల్​జేపీ' ఎన్నికల మేనిఫెస్టో ఇదే..

ABOUT THE AUTHOR

...view details