లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షుడిగా ఎంపీ చిరాగ్ పాసవాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చిరాగ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తండ్రి, కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్ వెల్లడించారు.
చిరాగ్ ప్రస్తుతం బిహార్‌లోని జామూయి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఎల్‌జేపీ అవతరించింది. బిహార్‌లో ఈ పార్టీకి దళిత వర్గంలో మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో ఆరు లోక్‌సభ స్థానాలు గెలుచుకోగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ సంఖ్యను నిలబెట్టుకుంది.