తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్మయానంద్​ను 7 గంటలపాటు విచారించిన సిట్ - అత్యాచార ఆరోపణలు

కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత చిన్మయానంద్​ను ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం రాత్రి 7 గంటలపాటు విచారించింది. ఓ న్యాయవిద్యార్థిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నేడు కూడా చిన్మయానంద్​ను సిట్ విచారించనున్నట్లు ఆయన తరపు న్యాయవాది ఓమ్​ సింగ్ తెలిపారు.

చిన్మయానంద్​ను 7 గంటలపాటు విచారించిన సిట్

By

Published : Sep 13, 2019, 1:21 PM IST

Updated : Sep 30, 2019, 11:01 AM IST

చిన్మయానంద్​ను 7 గంటలపాటు విచారించిన సిట్

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత స్వామి చిన్మయానంద్​ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) 7 గంటలపాటు విచారించింది. ఓ న్యాయవిద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్​ గురువారం రాత్రి చిన్మయానంద్​కు సమన్లు జారీ చేసినట్లు ఆయన తరపు న్యాయవాది ఓమ్ సింగ్​ తెలిపారు. విచారణ అనంతరం గట్టి బందోబస్తు మధ్య చిన్మయానంద్​ నివాసం ముముక్షు ఆశ్రమంలోని దివ్యధామానికి తీసుకువచ్చారని వెల్లడించారు. తరువాత ఆయన పడక గదిని పరిశీలించిన అధికారులు దానికి సీల్​ వేశారని పేర్కొన్నారు.

శుక్రవారం కూడా చిన్మయానంద్​పై దర్యాప్తు కొనసాగనుందని ఆయన తరపు న్యాయవాది ఓమ్ సింగ్ స్పష్టం చేశారు.

భాజపా సీనియర్ నేత చిన్మయానంద్​.. ఏడాదిపాటు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ న్యాయశాస్త్ర విద్యార్థిని సిట్​కు రాసిన లేఖలో ఆరోపించారు. చిన్మయానంద్ అనుచరులు తన హాస్టల్​ గది నుంచి కొన్ని ముఖ్య ఆధారాలను తీసుకుపోయారని ఆమె తెలిపారు.

ఎందుకు ఆలస్యం?

చిన్మయానంద్ కేసు వ్యవహారంలో యూపీ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. మహిళ భద్రతకు యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులు చిన్మయానంద్​ కేసు విషయంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రియాంక ట్విట్టర్​లో ప్రశ్నించారు. చిన్మయానంద్​పై ఇప్పటి వరకు అత్యాచారం కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:'పాకిస్థానీలం అనే మేము.. జిహాదీలకు శిక్షణనిచ్చాం'

Last Updated : Sep 30, 2019, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details