భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై లైంగిక ఆరోపణల కేసులో అదృశ్యమైన న్యాయవిద్యా విద్యార్థినిని పోలీసులు సుప్రీంకోర్టు ఎదుట హాజరు పరిచారు. యువతిని విచారించిన ధర్మాసనం ఆమెను 4 రోజుల పాటు దిల్లీలో పోలీసుల సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది.
ఈ నెల 24న అదృశ్యమైన యువతిని రాజస్థాన్‌లో స్నేహితులతో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆమెతో పాటు స్నేహితులను కూడా వెంటపెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్ పయనమయ్యారు అధికారులు. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఎ. ఎస్. బోపన్నలతో కూడిన సుప్రీం ధర్మసనం ముందు దృశ్య మాధ్యమం ద్వారా ప్రవేశపెట్టారు.