చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత పర్యటనను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది విదేశాంగ శాఖ. అక్టోబర్ 11, 12 తేదీల్లో జిన్పింగ్ భారత్లో పర్యటిస్తారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రెండో అనధికారిక సమావేశం చెన్నైకు సమీపంలోని మామళ్లపురం వేదికగా జరగనుందని వెల్లడించింది.
"ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానంపై.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెన్నై రానున్నారు. చెన్నై వేదికగా ఇరునేతల మధ్య రెండో అనధికారిక సమావేశం జరగనుంది."