ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన డ్రాగన్ పండు పేరును గుజరాత్లో మార్చారు. దానికి 'కమలం' అని నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం పేర్కొన్నారు. ఆ పువ్వు రూపంలో పండు కనిపిస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పేటెంట్ కోసం కూడా దరఖాస్తు దాఖలు చేశామని చెప్పారు. "ఆ పండుకు డ్రాగన్ అనే పేరు బాగాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపారు.
గుజరాత్లో డ్రాగన్ పేరు ఇక 'కమలం' - కమలం పండు పేరు గుజరాత్
గుజరాత్లో డ్రాగన్ పండు పేరును మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. దానికి 'కమలం' అని నామకరణం చేశారు.
గుజరాత్లో డ్రాగన్ పేరు ఇక 'కమలం'
పేరు మార్పుపై గుజరాత్ అటవీ శాఖ.. భారత వ్యవసాయ పరిశోధన మండలికి కూడా ప్రతిపాదనలను పంపింది. ఈ పండును గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్లో సాగు చేస్తారు. బత్తాయి, మామిడి, అరటి కన్నా అది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రూపానీ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. చైనాను డ్రాగన్ కూడా పిలుస్తుంటారు.
ఇదీ చూడండి:కురుక్షేత్ర మహా సంగ్రామానికి నిదర్శనం 'అభిమన్యుపూర్'!