సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఐదుగురు గల్లంతైన ఘటనపై ఎట్టకేలకు స్పందించింది చైనా. వారందరూ తమ భూభాగంలో కనిపించినట్టు వెల్లడించింది. భారత సైన్యానికి అందించిన సమాచారంలో చైనా సైన్యం ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు కేంద్రమంత్రి, అరుణాచల్‌ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజు వెల్లడించారు.
ఆ ఐదుగురిని వెనక్కి తీసుకొచ్చే విషయంపై చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు రిజిజు.