తూర్పు లద్దాక్‌లోని గాల్వన్ లోయపై తమకే సార్వభౌమాధికారం ఉందంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్రంగా మండిపడింది. చైనా వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
చైనా వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డ భారత్ - Indian MEA comments on China comments
గాల్వన్ లోయ తమదేనంటూ చైనా చేస్తోన్న వ్యాఖ్యలపై భారత్ మరోసారి మండిపడింది. ఈ వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
చైనా వ్యాఖ్యలపై మండిపడ్డ భారత్
చైనా ప్రకటన అంగీకారయోగ్యం కాదన్న అనురాగ్.. ఈ నెల 6న జరిగిన సైనికాధికారుల సమావేశంలో కుదిరిన అవగాహనకు ఇది విరుద్ధంగా ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. పరిస్థితిని బాధ్యతాయుత పద్ధతిలో పరిష్కరించుకోవాలని భారత్, చైనా అంగీకరించాలని ఆయన చెప్పారు. జూన్ 6 న కుదిరిన ఒప్పందాన్ని ఇరు దేశాలు మనస్ఫూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'గాల్వన్ ఘటనతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి'