తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారస్వామి 'రాజీనామా లేఖ' వెనకున్న కథేంటీ? - రాజీనామా లేఖ

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షపై విధానసభలో చర్చ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా లేఖ కలకలం రేపింది.  సభలో స్వామి టేబుల్​పై గవర్నర్​ ఫార్మాట్​లో రాజీనామా పత్రాలు కనిపించటం పలు ఊహాగానాలకు తావిచ్చింది.

కుమారస్వామి రాజీనామా లేఖ నిజమేనా!

By

Published : Jul 23, 2019, 7:47 AM IST

Updated : Jul 23, 2019, 4:30 PM IST

కుమారస్వామి రాజీనామా లేఖ నిజమేనా!
విశ్వాస పరీక్షపై చర్చ జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి కుమారస్వామి టేబుల్​పై ఆయన రాజీనామా లేఖ ఉండటం కలకలం రేపింది. లేఖ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సభలో విశ్వాస పరీక్ష పూర్తికాకముందే స్వామి రాజీనామా చేశారా? గవర్నర్​కు రాజీనామా సమర్పించేందుకు స్వామి సిద్ధపడ్డారా? అనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.

రాజీనామా లేఖలపై కుమారస్వామి స్పష్టతనిచ్చారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చూపేందుకే ఆ పత్రాలను సభకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి గవర్నర్​కు లేఖ పంపించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారని ఆరోపించారు. ఇలాంటి చౌకబారు ప్రచారాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు.

కుమారస్వామి రాజీనామా లేఖపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఆ లేఖ నకిలీదిగా పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చూడండి: బలపరీక్షకు స్పీకర్​ డెడ్​లైన్​- నేడు ఓటింగ్!

Last Updated : Jul 23, 2019, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details