రాజకీయంగా పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకుని, విభేదాలపై సరైన అవగాహన పెంచుకుని, దీర్ఘకాలం పాటు ద్వైపాక్షిక బంధాన్ని భద్రపరుచుకునేందుకు భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. దేశా సౌర్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన పాకిస్థాన్, చైనాకు తమ జవాన్లు గుణపాఠం చెప్పారని.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది.
"రెండు పొరుగు దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కాక ఈ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సును పెంపొందిస్తుంది. దీర్ఘకాలిక లక్షాలను గౌరవించి మద్దతునివ్వడం ఇరు దేశాలకు మంచిది. అందువల్ల.. రాజకీయంగా పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకుని, ద్వైపాక్షిక సంబంధాలను సుదృఢం చేసుకోవడానికి భారత్తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంది."