తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబీ గీతాలతో సరిహద్దుల్లో చైనా కొత్త కుట్రలు! - భారత్ చైనా సరిహద్దు వార్తలు

తూర్పు లద్దాఖ్​లో నిరంతర పహారా కాస్తోన్న భారత సైన్యం ఏకాగ్రత దెబ్బ తీసేందుకు చైనా వింత ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాంగాంగ్​లోని ఫింగర్​ 4 ప్రాంతంలో లౌడ్​స్పీకర్లు ఏర్పాటు చేసి పంజాబీ పాటలను వినిపించినట్లు ఓ అధికారి తెలిపారు.

CHINA LOUDSPEAKERS
సరిహద్దు

By

Published : Sep 17, 2020, 5:00 AM IST

పాంగాంగ్​ సరస్సు వద్ద భారత సైనికుల దృష్టి మరల్చేందుకు చైనా ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఫింగర్​ 4 ప్రాంతంలో లౌడ్​స్పీకర్లు ఏర్పాటు చేసిన పీఎల్​ఏ.. పంజాబీ గీతాలను ప్లే చేస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

పాంగాంగ్​లో చైనా కదలికలపై ఎత్తులో ఉన్న భారత సైన్యం నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఒత్తిడి తగ్గించడం లేదా భారత సైనికుల దృష్టి మరల్చేందుకు ఈ నాటకాలను తెరలేపిందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇదేమీ కొత్త విషయం కాదనీ, చాలా సార్లు చైనా ఇలా భారతీయ గీతాలను వినిపిస్తుంటుందని ఓ అధికారి తెలిపారు. పాటలతో భారత సైనికులను ఏమార్చాలని చైనా ప్రయత్నించటం మూర్ఖత్వమే అవుతుందని అన్నారు.

గాల్లోకి కాల్పులు..

ఇదే ప్రాంతంలో సెప్టెంబర్​ 8న 100-200 రౌండ్ల వరకు గాల్లోకి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఫింగర్‌ 3 నుంచి ఫింగర్‌ 4 మధ్య ఈ ఘటన చోటు చేసుకొంది. ఇక్కడ కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకొనే క్రమంలో ఇరు వర్గాలు పరస్పర హెచ్చరికలు జారీ చేసుకొనే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఓ అధికారి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:చైనా సరిహద్దుల్లో 200 రౌండ్ల కాల్పులు..?

ABOUT THE AUTHOR

...view details