తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 'కరోనా లేఖ'కు చైనా కృతజ్ఞతలు - Geng Shuang latest comments

చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ ధాటికి ఇప్పటికే 900మందికి పైగా మృతి చెందారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు డ్రాగన్​ దేశం చేస్తున్న పోరాటం అంతాఇంతా కాదు. ఇటీవలే చైనాకు సంఘీభావం తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మోదీ ఉత్తరాన్ని అభినందించిన చైనా.. భారత్​కు కృతజ్ఞతలు తెలిపింది.

China praises PM Modi's letter to XI on coronavirus assistance
మోదీ రాసిన కరోనా లేఖకు చైనా కృతజ్ఞతలు

By

Published : Feb 10, 2020, 11:24 PM IST

Updated : Feb 29, 2020, 10:16 PM IST

కరోనా వైరస్​కు సంఘీభావం తెలుపుతూ.. జిన్​పింగ్​కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాయడాన్ని చైనా అభినందించింది. వందలాదిమంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో తమకు బాసటగా నిలవాలన్న మోదీ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంజ్​ షువాంగ్​ ప్రకటన విడుదల చేశారు. కరోనాను అరికట్టేందుకు భారత్​తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

" కరోనాతో చేస్తున్న పోరాటంలో మాకు అండగా నిలిచినందుకు భారత్​కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్​ చర్యలు మా ఇరుదేశాల మధ్య ఉన్న మైత్రికి నిదర్శనం."
- గెంజ్​ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

రాత్రికి చైనాకు డబ్ల్యూహెచ్​ఓ...

కరోనా మహమ్మారి ధాటికి చైనాలో ఇప్పటిదాకా 908 మంది మృతి చెందగా.. 40 వేల మందికి పైగా జనాభా ఈ వైరస్​ బారిన పడ్డారు. కరోనాతో పోరాడుతున్న చైనా అధికారులకు సాయమందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఈ రాత్రికి చైనాకు చేరుకోనుంది.

ఇదీ చదవండి: కన్నబిడ్డల కోసం రోడ్డెక్కిన ఐపీఎస్‌ అధికారి

Last Updated : Feb 29, 2020, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details