తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్ ప్రతిఘటనను చైనా ఊహించలేకపోయింది' - భారత్ చైనా సరిహద్దు వార్తలు

తూర్పు లద్ధాఖ్​లో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారానికి చైనా ఆసక్తిగా లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో దుస్సాహసానికి భారత సైన్యం నుంచి ఊహించని ప్రతిస్పందనను చైనా ఎదుర్కొందని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఈ పరాభవం నుంచి బయటపడే వ్యూహాల కోసం చూస్తోందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

DEF-SINODINDIA-BORDER
తూర్పు లద్ధాఖ్

By

Published : Aug 22, 2020, 5:16 AM IST

Updated : Aug 22, 2020, 5:27 AM IST

తూర్పు లద్ధాఖ్​లో ఏప్రిల్​ పూర్వ స్థితిని నెలకొల్పాలని సైనిక చర్చల్లో చైనాపై భారత్ తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఫలితంగా రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తన చర్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పారు.

"ఈ మేరకు వాస్తవాధీన రేఖను మార్చటం ఆమోదయోగ్యం కాదని చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీకి భారత సైన్యం తేల్చిచెప్పింది. చైనా తన చర్యలకు సమర్థనగా వ్యూహాత్మక సమాధానాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారత్​ నుంచి అనూహ్యంగా తీవ్ర ప్రతిఘటన ఎదురుకావటం వల్ల చైనా ఆత్మరక్షణలో పడింది. ఈ పరాభవం నుంచి పరువు పోకుండా బయటపడేందుకు కొత్త వ్యూహాల వేటలో ఉంది."

- ప్రభుత్వ వర్గాలు

మభ్య పెట్టే ధోరణి..

భారత్​తో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా అంత సుముఖంగా లేదని మరో ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ముందుకు, వెనకకు జరుగుతూ మభ్య పెడుతోందని తెలిపారు.

తాజాగా జరిగిన దౌత్య చర్చల్లో వివాదాల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకునేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. ఇంతకుముందు కూడా భారత్, చైనా మధ్య అనేక సార్లు మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గల్వాన్​ ఘర్షణ

తూర్పు లద్దాక్​లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ.. జూన్​ ప్రారంభంలోనే భారత్​ చైనా మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు సైనిక బలగాలు సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లాలి. అయితే ఈ ప్రక్రియ జరుగుతుండగా.. ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం సంభవించినట్లు నివేదికలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:ఆధిపత్య పరుగులో చైనా... ఆయుధ అన్వేషణలో భారత్​

Last Updated : Aug 22, 2020, 5:27 AM IST

ABOUT THE AUTHOR

...view details