తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తైవాన్​ అంశంలో భారత్​పై 'గ్లోబల్ టైమ్స్' అక్కసు - Global Times Frustration on Taiwan's National Day celebration in India

తైవాన్ జాతీయ దినోత్సవ వేడుకలపై భారత్​లోని మీడియా వైఖరిని తప్పుబడుతూ గ్లోబల్ టైమ్స్​ కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని ఈశాన్యంలోని తిరుగుబాటు బృందాలకు ముడిపెడుతూ భారత్​కు హెచ్చరిక స్వరం వినిపించింది. ఈశాన్య భారత్​లోని తిరుగుబాటుదారులకు తమ మీడియా బహిరంగంగా మద్దతిస్తే భారత్ స్పందన చైనా కంటే తీవ్రంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

China mouthpiece rakes up Northeast India insurgency over Taiwan
తైవాన్​ అంశంలో భారత్​పై 'గ్లోబల్ టైమ్స్' అక్కసు

By

Published : Oct 13, 2020, 9:15 AM IST

లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చైనా ప్రభుత్వ మీడియా 'గ్లోబల్ టైమ్స్'.. భారత్​పై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత్​లోని పలు ప్రాంతాల్లో తైవాన్​ జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మీడియా మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. 'భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలోని తిరుగుబాటుదారులకు చైనా మీడియా బహిరంగంగా మద్దతిస్తే, లేదా భారత వేర్పాటువాద శక్తులకు అనుకూలంగా కథనాలు ప్రచురిస్తే దిల్లీ ఎలా స్పందిస్తుంది?' అంటూ ప్రశ్నించింది. భారత్ ప్రతిస్పందన చైనా కంటే తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. తన విద్వేష కలానికి పదును పెడుతూ పత్రికలో కథనం రాసుకొచ్చింది. ఈశాన్య తిరుగుబాటు సంస్థల కీలక నేతలు చైనాలో మకాం ఏర్పరచుకున్నారన్న సమాచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చదవండి-తైవాన్​ జాతీయ దినోత్సవం- భారత్​కు కృతజ్ఞతలు

నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిగం(ఎన్ఎస్​సీఎన్), యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) సంస్థల సీనియర్ నేతలు.. భారత్​ నుంచి వైదొలగాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చైనా సాయం కోసం అక్కడే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంతో 23 ఏళ్లుగా కొనసాగుతున్న చర్చలు ఎలాంచి ప్రతిఫలం లేకుండానే ఉన్నాయన్న నిరాశ ఎన్ఎస్​సీఎన్ క్యాంపుల్లో ఇప్పటికే పాతుకుపోయి ఉంది. నాగాలతో పాటు ఈశాన్య భారత్​లోని చాలా తిరుగుబాటు బృందాలకు చైనా ప్రభుత్వం సహకారం అందించిందన్న విషయం ఆధారాలతో బయటపడింది.

ఇదీ చదవండి-పాక్​ దారిలో చైనా- భారత్​తో ఇక పరోక్ష యుద్ధం!

గ్లోబల్ టైమ్స్​లో వచ్చిన ఈ కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా చైనా పత్రికలో వచ్చిన కథనాలను.. కమ్యునిస్టు ప్రభుత్వ అధికారిక వైఖరిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతదేశంలోని తిరుగుబాటుదారులతో చైనా సంబంధాలు పెట్టుకుంటుందనే పరోక్ష ముప్పును ఈ కథనాలు తెలియజేస్తున్నాయి.

'ఒకే చైనా'

మరోవైపు, ఒకే చైనా విధానానికి భారత్ అంగీకారం తెలిపిందని గ్లోబల్ టైమ్స్ గుర్తు చేసింది. చైనా-భారత్ దౌత్య సంబంధాలకు ఇదే పునాది అని చెప్పుకొచ్చింది. మరే ఇతర వైఖరులను ఆమోదించేదిలేదని స్పష్టం చేసింది. ఇతరదేశాలు ఈ స్థితి(ఒకే చైనా)ని మార్చేందుకు చేసే ప్రయత్నాలను చైనా అనుమతించదని పేర్కొంది.

ఇదీ చదవండి-కశ్మీర్​ సైనిక వ్యూహం ఈశాన్యంలో ఫలిస్తుందా?

చర్చల ద్వారా చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాదన్న అమెరికా వ్యాఖ్యలపై గ్లోబల్ టైమ్స్ స్పందించింది. భారత్​కు అమెరికా ఇచ్చే మద్దతు నమ్మదగినది కాదని వ్యాఖ్యానించింది.

ముందుగానే సూచనలు

తైవాన్ జాతీయ దినోత్సవం అక్టోబర్ 10న జరిగింది. మూడు రోజుల ముందుగానే దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. తైవాన్ విషయంలో భారత ప్రభుత్వ వైఖరికి మీడియా కట్టుబడి ఉండాలని సూచించింది. తైవాన్​ను ఓ దేశంగా, రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలవకూడదని తెలిపింది. తైవాన్ అధినేతను అధ్యక్షుడిగా సంబోధించకూడదని పేర్కొంది.

- సంజీవ్ బారువా (సీనియర్ పాత్రికేయుడు)

ABOUT THE AUTHOR

...view details