తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్నమలై గుహలో ఆ చైనీయుడు ఏం చేస్తున్నాడు? - corona virus in india

యావత్​ ప్రపంచం చైనాను కరోనా జన్మస్థానంగా చూస్తున్న వేళ... అదే దేశానికి చెందిన ఓ వ్యక్తి తమిళనాడు గుహలో దొరికాడు. 10 రోజులుగా ఒంటరిగా నివసిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొవిడ్​-19 పరీక్షలు నిర్వహించారు. ఇంతకీ ఆ చైనా వ్యక్తి భారతలోని గుహలో ఎందుకు దాక్కున్నాడు?

China man living alone in cave due to lockdown caught
అన్నమలై గుహలో ఆ చైనీయుడు ఏం చేస్తున్నాడు?

By

Published : Apr 18, 2020, 6:30 AM IST

Updated : Apr 21, 2020, 2:14 PM IST

తమిళనాడులోని అన్నమలై​ కొండ మీద.. ఓ గుహలో ఒంటరిగా నివసిస్తున్న చైనీయుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

దర్శనానికి వచ్చి...

చైనాలోని బీజింగ్​కు చెందిన యౌరుయి యాంగ్​(35).. కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని తిరువన్నమలై ఆలయాన్ని దర్శించుకునేందుకు భారత్​కు వచ్చాడు. ఆలయ మహిమల గురించి తెలుసుకున్న యౌరుయి యాంగ్ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడట. అలా ఫిబ్రవరి 26న ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ.. ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు.

గుహ గూడాయే..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకి.. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబట్టాడు యాంగ్​ ఇంటి యజమాని. తప్పని పరిస్థితుల్లో అద్దె ఇంటిని వీడాడు. కానీ కరోనా అపోహలతో.. చైనాకు చెందిన అతడికి ఆశ్రయమిచ్చేందుకు హోటళ్లు, లాడ్జీలు ససేమీరా అన్నాయి.

ఎక్కడికి వెళ్లాలో తెలియక... ఓ పర్యటక గైడ్​ సలహా మేరకు అన్నమలై కొండపైనున్న విరూపాక్ష గుహకు చేరుకున్నాడు. గుహనే గూడుగా చేసుకుని 10 రోజులుగా అందులోనే నివాసముంటున్నాడు. కేవలం మంచి నీరు, బిస్కట్లతో కాలం వెళ్లదీస్తున్నాడు.

అన్నమలై గుహలో ఆ చైనీయుడు ఏం చేస్తున్నాడు?

స్థానికుల సమాచారం మేరకు విరూపాక్ష గుహకు చేరుకున్న పోలీసులు.. యాంగ్​ను అదుపులోనికి తీసుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లి అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు యాంగ్​ శరీరంలో కరోనా లేనట్లు వైద్యులు నిర్ధరించారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న యాంగ్​కు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ కందసామి. స్వదేశానికి చేరుకునే వరకు జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. ప్రస్తుతం యాంగ్​.. రమణ మహర్షి రంగమ్మల్​ ఆసుపత్రిలో క్వారంటైన్​లో ఉన్నాడు. ​

ఇదీ చదవండి:ఆ ఇద్దరు అర్చకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్​!

Last Updated : Apr 21, 2020, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details