భారత్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ చైనా 6.5 లక్షల టెస్టింగ్ కిట్లు దేశానికి పంపింది. ఇవి ఈ రోజు సాయంత్రానికి భారత్ చేరే అవకాశం ఉంది. మహమ్మారిపై దేశం చేస్తోన్న పోరాటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిశ్రీ అభిప్రాయపడ్డారు.
15 రోజుల్లో మరో 20 లక్షలకు పైగా టెస్టింగ్ కిట్లను భారత్కు చైనా పంపనున్నట్లు ఆయన తెలిపారు.
కిట్ వివరాలు...
- మొత్తం కిట్ల సంఖ్య- 6,50,000
- రాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్లు- 3 లక్షలు
- ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు- 2.5 లక్షలు