తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"దశలవారీగా 'న్యాయం'- అమలు సాధ్యమే" - nuntham ayi yojana

కాంగ్రెస్ ప్రకటించిన న్యూన్తమ్ ఆయీ యోజన (న్యాయ్)అమలు సాధ్యమేనని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం స్పష్టంచేశారు. ఆర్థిక నిపుణులతో చర్చించాకే న్యాయ్​పై ప్రకటన విడుదల చేశామన్నారు.

న్యాయ్​ పథకంపై చిదంబరం స్పందన

By

Published : Mar 27, 2019, 1:38 PM IST

కాంగ్రెస్ ప్రకటించిన న్యూన్తమ్ ఆయీ యోజన(న్యాయ్) నిరుపేదలకు మేలు చేకూర్చే అత్యుత్తమ పథకమని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి ఆర్థిక నిపుణులతో చర్చించాకే న్యాయ్​ను ప్రకటించామని చెన్నైలో వెల్లడించారు. ఈ పథకం అమలుకు అయ్యే వ్యయం జీడీపీలో 1.8 శాతం మాత్రమేనని తెలిపారు.

దశల వారీ అమలు

న్యాయ్​ను దశల వారీగా అమలు చేస్తామని ప్రకటించారు చిదంబరం. ఈ పథకం ద్వారా 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు వివరించారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు తమవద్ద అనేక మార్గాలు, గణాంకాలున్నాయన్నారు. భాజపా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 2009లోనూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసినప్పుడు అరుణ్​జైట్లీ వ్యతిరేకించారని గుర్తుచేశారు.

పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన న్యాయ్ పథకంపై చేసే విమర్శలకు సమాధానమివ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు చిదంబరం. న్యాయ్​ పథకం అమలులో ఉన్న సాధక బాధకాలు తమకు తెలుసని వాటిని సరైన విధంగా ఎదుర్కొంటామన్నారు.

కిసాన్ సమ్మాన్​పై విమర్శలు

రైతులకు పెట్టుబడి సాయానికి ఉద్దేశించిన కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం అమలుపై విమర్శలు చేశారు చిదంబరం. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లుగా కిసాన్​ సమ్మాన్​ నిధిని ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు.ఏప్రిల్ 2న కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉందని చిదంబరం తెలిపారు.

న్యాయ్​ పథకంపై చిదంబరం స్పందన

"న్యాయ్ పథకం పేదరికంపై మెరుపుదాడి. పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసినా జీడీపీలో 1.8 శాతమే వ్యయమవుతుంది. న్యాయ్​ అమలుపై చాలామంది ఆర్థిక నిపుణులతో సంప్రదించాం. ఈ పథకాన్ని అమలు చేసేందుకు భారత్​కు శక్తి సామర్థ్యాలున్నాయని వారు తెలిపారు. పథకాన్ని సరైన విధంగా రూపొందించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరీక్షిస్తాం. అనంతరమే అమలు చేస్తాం. నెలకు 6 వేల రూపాయలు చొప్పున ఏటా రూ. 72వేలు ఖాతాలో జమ చేస్తాం. కుటుంబంలోని మహిళ ఖాతాలో ఈ డబ్బును జమచేస్తాం. ప్రతీ కుటుంబంలోని మహిళ పేరుతో బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. "

- పి. చిదంబరం, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ఇదీ చూడండి:'నరేంద్ర మోదీ' చిత్ర నిర్మాతలకు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details