తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధం' - India China border dispute

china-also-claims-approximately-90000-sq-kms-of-indian-territory-in-the-eastern-sector-of-the-india-china-boundary-in-arunachal-pradesh-defence-minister-rajnath-singh
'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధం'

By

Published : Sep 17, 2020, 12:37 PM IST

Updated : Sep 17, 2020, 2:27 PM IST

13:04 September 17

చైనాతో సరిహద్దు వివాదంపై రాజ్​నాథ్​ ప్రకటన

చెప్పేది ఒకటి, చేసేది ఒకటి

భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. 1988 తర్వాత భారత్‌, చైనాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయని తెలిపారు. చైనా చెప్పేదొకటి, చేసేదొకటని ఆయన‌ అభిప్రాయపడ్డారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇది మంచి పద్దతి కాదని ఆయన చైనాకు హితవు పలికారు. 

1962లో లద్దాఖ్‌లో చైనా 38వేల చదరపు కి.మీ మేర ఆక్రమించిందని స్పష్టంచేశారు రాజ్​నాథ్​. అదే సమయంలో పాకిస్థాన్‌ నుంచి 5వేల చ.కి.మీ భూమిని తీసుకొందని పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వేల చ.కి.మీ భూభాగం తనదని చైనా వాదిస్తోందని అన్నారు. అయితే, ప్రస్తుతం లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ రాజ్యసభకు తెలియజేశారు.

12:32 September 17

'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధం'

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై రాజ్యసభలో రాజ్‌నాథ్‌ ప్రకటన

  • లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి: రాజ్‌నాథ్‌
  • 1962లో లద్దాఖ్‌లో చైనా 38 వేల చదరపు కి.మీ. ఆక్రమించింది: రాజ్‌నాథ్‌
  • పాక్‌ నుంచి 5 వేల చదరపు కి.మీ. భూమిని చైనా తీసుకుంది: రాజ్‌నాథ్‌
  • అరుణాచల్‌ప్రదేశ్‌లోని వేల చదరపు కి.మీ. భూభాగం తనదని చైనా వాదిస్తోంది: రాజ్‌నాథ్‌
  • 1988 తర్వాత భారత్‌, చైనా అనేక ఒప్పందాలు చేసుకున్నాయి: రాజ్‌నాథ్‌
  • సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడం మంచిది కాదు: రాజ్‌నాథ్‌సింగ్‌
  • 1988 నుంచి 2003 వరకు రెండు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందాలు జరిగాయి: రాజ్‌నాథ్‌
  • సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితి ఉండాలని భారత్‌ కోరుకుంటోంది: రాజ్‌నాథ్‌
  • చైనా మాత్రం సరిహద్దుల్లో భారత్‌ను కవ్విస్తోంది: రాజ్‌నాథ్‌సింగ్‌
Last Updated : Sep 17, 2020, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details