మిరపకాయలు ఎంత ఖరీదైనా.. కిలోల కొద్దీ ఎండు మిర్చి తెచ్చుకుని, దంచి కారం పట్టించుకుని నిల్వ చేసుకోవడం మన అలవాటు. వందల కొద్దీ పెరిగితే సరే కానీ, వేలకు వేలు పోసి ఎవరైనా కొంటారా? కొంటారు. ఎక్కడో కాదు, పక్క రాష్ట్రం కర్ణాటకలో మంజునాథ గాదా రెడ్డి క్వింటా మిరపకాయలను అక్షరాల 33 వేల 333 రూపాయలకు అమ్మి చూపించాడు.
మిర్చి ఘాటు అదిరింది.. రూ.33 వేలు రేటు పలికింది! - RED CHILLI 33K IN HAVERI
కూరల్లో కారం కాస్త తగ్గితే.. 'ఈ చప్పటి తిండి ఎలా తినాలిరా బాబూ' అను గొణుక్కుంటూ ఉంటాం. అవును మరి ఉప్పు కారం ఎక్కువ మోతాదులో తినడం భారత జిహ్వాలకు అలవాటైన రుచి. ఇక దక్షిణ భారత దేశంలో కారం కనిపించని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. నాణ్యమైన మిర్చి దొరికితే ఎంత రేటైనా పెట్టి కొనేస్తారు. అందుకేనేమో కర్ణాటకలోని ఓ రైతు క్వింటా మిరపకాయలను రూ. 33 వేలకు విక్రయించి రికార్డు సృష్టించాడు.
మిర్చి ఘాటు అదిరింది.. రూ.33 వేలు రేటు పలికింది!
హవేరీలోని బ్యాదగీ పట్టణ రైతు మార్కెట్లో.. దేశంలోనే తొలిసారి క్వింటా మిరపకాయలు రూ.33,333కు విక్రయించి రికార్డు సృష్టించాడు మంజునాథ్. ఒక్కసారిగా ఇంత ఎక్కువ లాభం వచ్చే సరికి.. ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
ఇదీ చదవండి:తమిళనాడులో జల్లికట్టుకు బసవన్నలు సిద్ధం
Last Updated : Jan 14, 2020, 8:31 PM IST